- సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆళవందార్ వేణు మాధవ్
- సచివాలయంలో మంత్రి సీతక్కకు వినతిపత్రం అందజేసిన సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్
హైదరాబాద్, ఆర్.కె న్యూస్: పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు వాగ్దానం చేసిన వైద్య సౌకర్యాలను వెంటనే అమలు చేయాలని సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆళవందార్ వేణు మాధవ్ డిమాండ్ చేశారు. బుధవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్కను ఆయన కలిసి వినతిపత్రం సమర్పించారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చి వృద్ధాప్యంలో ఉన్న రిటైర్డ్ ఉద్యోగులను ఆదుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేషీ అధికారులకు కూడా సమస్యల నివేదికను అందజేశారు. గత ఏడాది అక్టోబర్ 7న ప్రజా భవన్లో జరిగిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామి కీలక ప్రకటన చేశారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల వైద్య ప్రయోజనం కోసం ప్రస్తుతం ఉన్న 8 లక్షల రూపాయలకు అదనంగా మరో 2 లక్షల రూపాయల కేటాయింపును ప్రకటించారు. ఈ హామీ ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. ప్రస్తుతం విధుల్లో ఉన్నవారు, పదవీ విరమణ చేసిన ఉద్యోగుల ప్రయోజనం కోసం హైదరాబాద్లో ఒక కార్పొరేట్ స్థాయి ఆసుపత్రిని స్థాపించాలని అసోసియేషన్ కోరింది. ఈ ప్రతిపాదనను ప్రభుత్వం త్వరితగతిన పరిశీలించాలని విన్నవించారు. దివంగత కాకా వెంకటస్వామి ప్రారంభించిన 1998 పింఛను పథకాన్ని గత 28 ఏళ్లుగా సమీక్షించలేదు. దీనివల్ల కోల్ ఇండియా, సింగరేణికి చెందిన దాదాపు ఐదున్నర లక్షల మంది పదవీ విరమణ చేసిన ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా మందికి నెలసరి పింఛను వెయ్యి రూపాయల కంటే తక్కువగా అందుతోంది. ఎంపీ గడ్డం వంశీ కృష్ణ లోక్సభలో పింఛను పెంపు విషయాన్ని పలుమార్లు లేవనెత్తినా ఫలితం లేకుండా పోయింది. వాగ్దానం చేసిన వైద్య సౌకర్యాలను అమలు చేసేలా సింగరేణి సీఎండీకి తగిన ఆదేశాలు జారీ చేయాలని వేణు మాధవ్ విజ్ఞప్తి చేశారు.




అన్ని డివిజన్లలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. పేరుకుపోయిన చెత్త తొలగింపు, వీధి దీపాల ఏర్పాటు, మంచినీటి సరఫరా, సీసీ రోడ్ల మరమ్మతులు వేగవంతం చేసినట్లు వివరించారు. 34వ డివిజన్ సింగరేణి ప్రాంతం అయినప్పటికీ మున్సిపల్, సింగరేణి అధికారుల సమన్వయంతో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని మధుకర్ పేర్కొన్నారు. ప్రజలు చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా మున్సిపల్, సింగరేణి చెత్త తరలింపు వాహనాలను ఉపయోగించాలని సూచించారు. డివిజన్ అభివృద్ధికి స్థానిక ప్రజలు సహకరించాలని కోరారు. పర్యటనలో భాగంగా ఆయన స్థానికులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. వాటి పరిష్కారం కోసం సిబ్బందికి తగిన ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్, 34వ డివిజన్ కార్పొరేటర్ అగ్గు సాగర్, 33వ డివిజన్ కార్పొరేటర్ ఎంబడి కుమారస్వామి, 26వ డివిజన్ కార్పొరేటర్ ఇరగదుండ్ల రవి, 30వ డివిజన్ కార్పొరేటర్ కర్రె శ్రీనివాస్, మున్సిపల్, సింగరేణి అధికారులు, సిబ్బంది, స్థానిక కాంగ్రెస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.