కొండగట్టు అంజన్న సన్నిధిలో మధుసూదనాచారి

కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనం.. ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రతిపక్ష నేత

మల్యాల, ఆర్.కె న్యూస్: జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానాన్ని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి బుధవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. స్వామివారి సన్నిధిలో మధుసూదనాచారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం ఆలయ మండపంలో అర్చకులు వేదోక్త మంత్రాలతో ఆశీర్వచనం అందించారు. దేవస్థాన ఈఓ ఎస్. అంజనారెడ్డి ఆయనకు శాలువా కప్పి సత్కరించారు. ఆలయ లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment