- బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్
- జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన ఏకారి లిఖితకు ఘన సన్మానం
నస్పూర్, ఆర్.కె న్యూస్: పట్టుదలతో చదివితేనే అత్యున్నత పదవులు దక్కుతాయని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ పేర్కొన్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీరాంపూర్ అరుణక్కనగర్‌కు చెందిన ఏకారి లిఖిత ఇటీవల వెలువడిన ఫలితాల్లో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా శనివారం విజిత్ కుమార్ నస్పూర్ పట్టణ నాయకులతో కలిసి లిఖిత నివాసానికి వెళ్లారు. ఆమెను శాలువాతో సత్కరించి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి పట్టుదలతో శ్రమించి న్యాయశాఖలో ఉన్నత కొలువు సాధించడం జిల్లాకే గర్వకారణమని కొనియాడారు. లిఖిత సాధించిన విజయం స్థానిక యువతకు, విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని విజిత్ కుమార్ అన్నారు. లక్ష్యసాధన కోసం కృషి చేస్తే విజయం తప్పక వరిస్తుందని ఈ విజయం నిరూపించిందని తెలిపారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సుబ్బయ్య, కార్యదర్శి పవన్, మాజీ సర్పంచ్ మల్లెత్తుల రాజేంద్రపాణి, కార్పొరేటర్ గుమ్మడి శ్రీనివాస్, నాయకులు వంగ తిరుపతి, సిద్ధం తిరుపతి, రాజేశ్వర్ రెడ్డి, పెట్టం నరేష్, శ్రవణ్, నాగేష్, సంపత్, రమేష్, అఖిల్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.




భాగంగా శనివారం 02వ డివిజన్లో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ చేపట్టారు. ఈ పనులను డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్‌తో కలిసి మేయర్ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. పారిశుద్ధ్య పనుల పురోగతిపై అధికారులకు తగిన సూచనలు చేశారు. పట్టణ అభివృద్ధి, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు దర్ని మధుకర్ వెల్లడించారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించి పారిశుద్ధ్య కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రతి డివిజన్లో పరిశుభ్రతకు పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు కూడా తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకుని మున్సిపల్ యంత్రాంగానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 02వ డివిజన్ కార్పొరేటర్ పుట్ట యశోద, మంచిర్యాల మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సల్ల మహేష్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు భూపతి శ్రీనివాస్, నస్పూర్ యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అజయ్ గౌడ్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.