సింగరేణి గోలేటి జనరల్ మేనేజర్ విజయభాస్కర రెడ్డి
బెల్లంపల్లి, ఆర్.కె న్యూస్: నిరక్షరాస్యత, మూఢనమ్మకాలు, దురాచారాలు విస్తరించి ఉన్న కాలంలో ప్రజలను చైతన్యవంతం చేసిన సంఘ సంస్కర్తల సేవలు చిరస్మరణీయమని, అలాంటి మహనీయులు సమాజంలో మహాత్ములుగా నిలిచారని బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఎం. విజయభాస్కర రెడ్డి అన్నారు. శనివారం గోలేటి లోని జనరల్ మేనేజర్ కార్యాలయం ఆవరణలో మహాత్మా జ్యోతి రావ్ పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జీఎం పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వక్తలు పూలే చేసిన సామాజిక సేవలను కొనియాడారు. జీఎం విజయభాస్కర రెడ్డి మాట్లాడుతూ, మనుషులందరూ సమానమే, కుల మత భేదాలు లేని సమాజమే నిజమైన అభివృద్ధికి దారి తీస్తుంది అన్నారు. రెండు శతాబ్దాల క్రితం పూలే చేసిన సేవల ఫలాలను నేటి తరాలు అనుభవిస్తున్నాయని పేర్కొన్నారు. అనంతరం ఉద్యోగులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఏఐటియుసి బ్రాంచ్ కార్యదర్శి ఎస్. తిరుపతి, సీఎంఓ ఏఐఏరియా అధ్యక్షుడు మచ్చగిరి నరేందర్, ఏరియా ఇంజినీర్ జి. కృష్ణమూర్తి, ఎస్ఓటు జిఎం కె. రాజమల్లు, బీసీ లైజన్ అధికారి మామిడి రవికుమార్, బీసీ-ఓబీసీ ఉద్యోగ సంఘం నాయకులు పేరం శ్రీనివాస్, మారం శ్రీనివాస్, డీజీఎం (సివిల్) మదీనా బాష, పర్సనల్ విభాగం హెచ్‌ఓడీ మండల శ్రీనివాస్, వివిధ విభాగాల అధిపతులు, అధికారులు, బీసీ యూనియన్ నాయకులు, జీఎం కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా బెల్లంపల్లి ఏరియాలోని ఖైరిగుర ఓసీ, గోలేటి సిహెచ్‌పీ, ఏరియా ఆసుపత్రి, వర్క్‌షాప్, స్టోర్స్, ఏజెంట్ ఆఫీస్, ఎంవీటీసీ కార్యాలయాల్లో కూడా మహాత్మా జ్యోతి రావ్ పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.







