శ్రీరాంపూర్ ఆర్.కె-7 భూగర్భ గనిని సందర్శించిన సీనియర్ సివిల్ జడ్జి నిరోష
నస్పూర్, ఆర్.కె న్యూస్: దేశానికి వెలుగులు పంచేందుకు చీకటి గనుల్లో సింగరేణి ఉద్యోగులు పడుతున్న కష్టాన్ని ప్రత్యక్షంగా చూడటం ఒక ప్రత్యేక అనుభూతి అని మంచిర్యాల జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్, సీనియర్ సివిల్ జడ్జి నిరోష పేర్కొన్నారు. మంగళవారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే-7 భూగర్భ గనిని ఆమె సందర్శించారు. గని అధికారులతో కలిసి అండర్ గ్రౌండ్లోకి వెళ్లి పని ప్రదేశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా బొగ్గు ఉత్పత్తి తీరుతెన్నులు, వివిధ విభాగాల ఉద్యోగుల పనితీరును జడ్జి నిరోష ఆసక్తిగా గమనించారు. గని విస్తీర్ణం, ఉత్పత్తి లక్ష్యాలు, ఉద్యోగుల పని విధానం, రక్షణ కోసం యాజమాన్యం చేపడుతున్న చర్యలను గని మేనేజర్ జె. తిరుపతి ఆమెకు వివరించారు. అనంతరం జడ్జి మాట్లాడుతూ.. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో చమటోడ్చుతున్న ఉద్యోగుల భద్రతకు సింగరేణి సంస్థ అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందనే విషయం లోపలి పరిస్థితులను చూస్తే స్పష్టమవుతోందన్నారు. ముఖ్యంగా సేఫ్టీ విషయంలో యాజమాన్యం చేపడుతున్న చర్యలు అభినందనీయమని ప్రశంసించారు. ఈ గనితో పాటు సింగరేణి సంస్థ భవిష్యత్తులో మరింత ప్రగతి సాధించి, పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గని మేనేజర్ జె. తిరుపతి, డిప్యూటీ మేనేజర్ వెంకట్రామ్, సీనియర్ పీఓ సంతన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.




ఉమారాణి దంపతులతో పాటు 29 జంటలు పాల్గొని భక్తిశ్రద్ధలతో వ్రతాలను ఆచరించాయి. ఆలయ అర్చకులు శ్రీరాంభట్ల ఆనంద్ శర్మ, సాత్విక్ శర్మ, ఆకాష్ శర్మల వేదమంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా వ్రతాలు జరిగాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించడంతో పరిసరాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. దూర ప్రాంతాలకు వెళ్లే వ్యయప్రయాసలు లేకుండా స్థానికంగానే సామూహిక వ్రతాలు ఏర్పాటు చేయడం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేశారు. వినాయక, దేవీ, వారాహి నవరాత్రి ఉత్సవాలతో పాటు ప్రతినెలా సంకటహర చతుర్థి పూజలు, సత్యనారాయణ వ్రతాలు నిర్వహిస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్న కమిటీ సభ్యులను భక్తులు అభినందించారు. వ్రతాల అనంతరం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన కార్యదర్శి తౌటం మల్లేష్, పద్మశాలి సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి కుందారపు రమేష్, కోశాధికారి రాజబాబు, కమిటీ సభ్యులు ఆడేటి రాజన్న, కుందారపు రాములు, సత్కూరి రవీందర్, చిలువేరు సదానందం, కటకం లక్ష్మణ్, కన్నం సాంబయ్య, గుండు యాదగిరి, సూరం శ్రీనివాస్, జక్కని సర్వేశం, శంకర్, మహిళా అధ్యక్షురాలు చిప్ప సులోచన, ఎరుమండ్ల సరోజన, సునీత, పద్మ తదితరులు పాల్గొన్నారు.