కార్తీక పౌర్ణమి వేళ సామూహిక సత్యనారాయణ వ్రతాలు

  • నస్పూర్ మార్కండేయ దేవాలయంలో 29 జంటలతో ప్రత్యేక పూజలు
  • వ్రతంలో పాల్గొన్న శ్రీరాంపూర్ జీఎం మునిగంటి శ్రీనివాస్ దంపతులు.. భక్తులకు అన్నప్రసాద వితరణ

నస్పూర్, ఆర్.కె న్యూస్: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం నస్పూర్ పట్టణంలోని శ్రీ లక్ష్మీ గణపతి శివ మార్కండేయ దుర్గామాత దేవాలయంలో ఆలయ కమిటీ, నస్పూర్ పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్–ఉమారాణి దంపతులతో పాటు 29 జంటలు పాల్గొని భక్తిశ్రద్ధలతో వ్రతాలను ఆచరించాయి. ఆలయ అర్చకులు శ్రీరాంభట్ల ఆనంద్ శర్మ, సాత్విక్ శర్మ, ఆకాష్ శర్మల వేదమంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా వ్రతాలు జరిగాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించడంతో పరిసరాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. దూర ప్రాంతాలకు వెళ్లే వ్యయప్రయాసలు లేకుండా స్థానికంగానే సామూహిక వ్రతాలు ఏర్పాటు చేయడం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేశారు. వినాయక, దేవీ, వారాహి నవరాత్రి ఉత్సవాలతో పాటు ప్రతినెలా సంకటహర చతుర్థి పూజలు, సత్యనారాయణ వ్రతాలు నిర్వహిస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్న కమిటీ సభ్యులను భక్తులు అభినందించారు. వ్రతాల అనంతరం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన కార్యదర్శి తౌటం మల్లేష్, పద్మశాలి సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి కుందారపు రమేష్, కోశాధికారి రాజబాబు, కమిటీ సభ్యులు ఆడేటి రాజన్న, కుందారపు రాములు, సత్కూరి రవీందర్, చిలువేరు సదానందం, కటకం లక్ష్మణ్, కన్నం సాంబయ్య, గుండు యాదగిరి, సూరం శ్రీనివాస్, జక్కని సర్వేశం, శంకర్, మహిళా అధ్యక్షురాలు చిప్ప సులోచన, ఎరుమండ్ల సరోజన, సునీత, పద్మ తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment