ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాల కోసం అంకితభావంతో పనిచేయాలి

మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు
గూడెం సత్యనారాయణ స్వామి దేవస్థానం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

మంచిర్యాల, ఆర్.కె న్యూస్: గూడెం శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవస్థానం నూతన పాలకమండలి సభ్యులు ఆలయ పవిత్రతను కాపాడుతూ, ఆలయ అభివృద్ధికి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అంకితభావంతో పనిచేయాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు సూచించారు. కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం దండేపల్లి మండలం గూడెం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు, ఈవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. నూతన కమిటీ సభ్యులుగా కొక్కిరాల సురేఖ, వంగపల్లి పూర్ణచందర్ రావు, మాదంశెట్టి సత్యనారాయణ, సువర్ణం వెంకటరమణ, బొల్లం భీమయ్య, తాండ్ర లింగయ్య, బొలిశెట్టి కిషన్, అక్కల శకుంతల, పుప్పిరెడ్డి బాపురెడ్డి, ఆకుల తిరుపతి, బొద్దున సంధ్యారాణి, గట్టు స్రవంతి, అడ్డగురి రమేష్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు నూతన కమిటీ సభ్యులను శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు ఆలయ అర్చకులు కొక్కిరాల సురేఖ – ప్రేమ్‌సాగర్ రావు దంపతులకు వేద ఆశీర్వచనం అందించారు. కార్యక్రమం అనంతరం స్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎమ్మెల్యే స్వయంగా పులిహోర నైవేద్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్, మంచిర్యాల మేయర్ ధర్ని మధుకర్, లక్షెట్టిపేట మున్సిపల్ చైర్‌పర్సన్ దొంత అంజలి-నర్సయ్య, వైస్ చైర్‌పర్సన్ మోత్కూరు రాజేశ్వరి-వెంకటస్వామి గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్లు అక్కల వెంకటేశ్వర్లు, రామగిరి బానేష్, సింగిల్ విండో చైర్మన్లు నాగభూషణం, ముత్యాల శ్రీనివాస్, దేవేందర్ రెడ్డి, ఆర్‌జీపీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అర్కాల హేమలత, పట్టణ అధ్యక్షురాలు గజ్జల హేమలత, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, డైరెక్టర్లు, నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment