సామాన్యుడి సమరభేరి సభను విజయవంతం చేయాలి

ఆర్.కె న్యూస్, మంచిర్యాల: ఈనెల 24న హైదరాబాద్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సామాన్యుడి సమరభేరి బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు అన్నారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ మాల్వియా నగర్ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఇంచార్జ్ సోమనాథ్ భారతి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్న ఈ సభను తెలంగాణ రాష్ట్ర ఆమ్ ఆద్మీ పార్టీ కుటుంబ సభ్యులు, ప్రజలందరూ పాల్గొని సభను విజయవంతం చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను బహిరంగ సభ వేదికగా ప్రజలకు తెలుపుతామన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తేనే స్వాతంత్య్ర ఫలాలు సామాన్యుడికి అందుతాయని, రాజకీయ విప్లవంలో సామాన్య ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ మంచిర్యాల జిల్లా కన్వీనర్ నల్ల నాగేంద్ర ప్రసాద్, జనరల్ సెక్రటరీ నయీమ్ పాషా, విద్యార్థి విభాగం జిల్లా కన్వీనర్ కొంటు రాజు, నాయకులు పల్లికొండ సంజయ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment