ఆదాయపు పన్ను రికవరీలతో ఆందోళనలో కార్మికులు

ఏరియర్స్ డబ్బులలో ఆదాయపు పన్ను రికవరీలు చూసి కార్మికులు ఆందోళన చెందుతున్నారన్నారని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ శ్రీరాంపూర్ బ్రాంచ్ కార్యదర్శి భాగ్యరాజ్ అన్నారు. శుక్రవారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్సార్పీ3 గని కార్మికులను కలిసి ఏరియర్స్ పై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ శ్రీరాంపూర్ బ్రాంచ్ మాట్లాడుతూ ఏరియర్స్ డబ్బులలో ఆదాయపన్ను పేరిట ఎంత శాతం కోతలు వేశారో ఇచ్చిన  చిట్టీలలో స్పష్టంగా లేదన్నారు. 23 నెలల వివరాలతో కూడిన చిట్టీలు అందించాల్సిన యాజమాన్యం కేవలం మొత్తం ఆదాయపు పన్ను రికవరీ, వచ్చే డబ్బుల వివరాలు మాత్రమే ఇవ్వడంతో కార్మికులు అయోమయానికి గురవుతున్నారన్నారు. కార్మికుల్లో అనుమానాలు తొలగించేందుకు 23 నెలల ఏరియర్స్ కు సంబంధించిన వివరాలతో కూడిన చిట్టిలను అందించాలని, పూర్తి వివరాలతో ఉన్న చిట్టీలు కొన్ని గనులపై ఇస్తూ మరికొన్ని గనులపై ఇవ్వకపోవడంతో కార్మికులు అయోమయానికి గురవుతున్నారన్నారు. కార్మికులందరికీ పూర్తి సమాచారంతో ఉన్న చిట్టీలు ఇవ్వాలని యాజమాన్యాన్ని విజ్ఞప్తి చేశారు. ఏరియర్స్ డబ్బులలో క్వార్టర్ ఉన్న కార్మికులకు ఎక్కువ రికవరీ అవుతుందని, ఇప్పటికైనా 2011లో కోల్ ఇండియాలో చేసుకున్న వేతన ఒప్పందం ప్రకారం అలవెన్సు లపై ఆదాయపు పన్ను మాఫీ ఒప్పందాన్ని అమలు చేయాలని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. బోర్డర్ లో సైనికులతో సింగరేణి కార్మికులను పోల్చి ఎన్నికల్లో ఓట్లు దండుకుంటున్న ప్రజాప్రతినిధులు ఆదాయ పన్ను రద్దు పై పార్లమెంట్ లో మాట్లాడాలని డిమాండ్ చేశారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment