సిర్పూర్ నియోజకవర్గ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత

– రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గ అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనివ్వడం జరుగుతుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, శాస్త్ర సాంకేతిక, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం సిర్పూర్ నియోజకవర్గ పరిధిలో తలపెట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు, శాసనమండలి సభ్యులు దండే విఠల్, సిర్పూర్ నియోజకవర్గ శాసనసభ్యులు కోనేరు కోనప్పతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే విధంగా ప్రభుత్వం రాధిక ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. సిర్పూర్ నియోజకవర్గంలోని అచ్చెల్లి – చింతకుంట వంతెన, శివపూర్ – హీరపూర్ వంతెన ప్రారంభించడం జరిగిందని, శివపూర్ – హీరాపూర్ రోడ్డుకు భూమి పూజ, పాతట్లగూడ వంతెన ప్రారంభించడం జరిగిందని, ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మన్నేవార్ సంఘం భవనానికి భూమి పూజ చేయడం జరిగిందని తెలిపారు. కౌటాల మండలంలో మొఘడ్ దగడ్ – వైగాం రోడ్డుకు భూమి పూజ, వార్థా నదిపై 75 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న గుండాయిపేట్ –  నందివర్థా (మహారాష్ట్ర) మధ్య హైలెవల్ అంతర్రాష్ట్ర వంతెన నిర్మాణానికి భూమి పూజ, చింతల మానేపల్లి మండల కేంద్రంలో 133 కె . వి. సబ్ స్టేషన్ కు భూమి పూజ, చింతల్ పాటి – గురుడుపేట్ రోడ్డుకు, చింతలమానేపల్లి – గంగపూర్ రోడ్డుకు, కర్జెళ్లి – బారేగూడ రోడ్డుకు భూమి పూజ, దిందాలో లో-లెవల్ వంతెన నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగిందని తెలిపారు. ప్రజల సంక్షేమం, ఆరోగ్యం, అభివృద్ధి కోసం ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని తెలిపారు. దివ్యాంగుల సంక్షేమం పై ప్రత్యేక దృష్టి సారించి ప్రతి నెల 4 వేల 16 రూపాయల పెన్షన్ అందించడం జరుగుతుందని, మహిళా సంక్షేమం కోసం ఆరోగ్య మహిళా కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు గర్భిణులకు సకాలంలో సరైన పోషకాహారం అందించేందుకు న్యూట్రిషన్ కిట్, ప్రసవం తర్వాత బాలింతలకు కె సి ఆర్ హిట్ అందించడం జరుగుతుందని తెలిపారు. వెనుకబడిన తరగతులు, మైనారిటీల కొరకు 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయం పథకాన్ని అందించడం జరుగుతుందని, గృహలక్ష్మి పథకం ద్వారా సొంత ఇంటి స్థలం ఉండి ఇల్లు నిర్మించుకునే ఆర్థిక స్తోమత లేని వారికి 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఇలా అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభ్యున్నతికి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment