రాపోలు విష్ణువర్ధన్ రావుకు ఎడ్యుకేషన్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం

ఆర్.కె న్యూస్, నస్పూర్: మంచిర్యాల పట్టణంలోని రివిలేషన్ హై స్కూల్ కరస్పాండెంట్ రాపోలు విష్ణువర్ధన్ రావు ఎడ్యుకేషన్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్ 2024 అవార్డు అందుకున్నారు. శనివారం హైదరాబాద్ లోని ది పార్క్ హోటల్ లో యూనివర్సల్ మెంటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంచిర్యాలకు చెందిన విష్ణువర్ధన్ రావుకు ఇచ్చారు. విద్యారంగ అభివృద్ధికి చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ అవార్డు అందజేశారు. అవార్డు అందుకున్న తర్వాత రాపోలు విష్ణు వర్ధన్ రావు తన కృతజ్ఞతను వ్యక్తం చేస్తూ, ఈ గుర్తింపు మా విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించడానికి మా సమిష్టి కృషికి ప్రతిబింబం అని అన్నారు. రాబోయే రోజుల్లో మంచిర్యాలను  ప్రముఖ విద్యా కేంద్రంగా మార్చడమే తన లక్ష్యం అని అన్నారు. ఇప్పటికే మంచిర్యాలలో విద్యా వ్యవస్థలో గణనీయమైన మార్పు వచ్చిందని, గతంలో కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ వంటి నగరాల్లో విద్య పొందడానికి విద్యార్థులు వెళ్లేవారని, ఇప్పుడు విద్యార్థులు తమ స్వస్థలంలోనే చదవడానికి ఇష్టపడుతున్నారని, తన విజన్, అంకితభావంతో మొత్తం సమాజాన్ని ఉన్నత స్థాయికి తీసుకు వెళ్ళడానికి కృషి చేస్తానని రాపోల్ విష్ణువర్ధన్ రావు తెలిపారు. రాపోలు విష్ణు వర్ధన్ రావు కు ఎడ్యుకేషన్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్ 2024 అవార్డు పొందడం పట్ల మంచిర్యాల లోని పలువురు మేధావులు, రాజకీయ నాయకులు, అధికారులు, పలు పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేసి అభినందనలు తెలియజేశారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment