మిర్యాలగూడ బిసి బహిరంగ సభను విజయవంతం చేయాలి

  • తీన్మార్ మల్లన్న టీం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మహేష్ వర్మ

ఆర్.కె న్యూస్, మంచిర్యాల:  ఈ నెల 3న మిర్యాలగూడలో జరుగనున్నబిసి బహిరంగ సభను మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్న బిసిలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తీన్మార్ మల్లన్న టీం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మహేష్ వర్మ కోరారు. బహిరంగ సభ ఏర్పాట్లలో పాల్గొనేందుకు శుక్రవారం తీన్మార్ మల్లన్న టీం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మహేష్ వర్మ ఆధ్వర్యంలో టీం సభ్యులు మిర్యాలగూడకు బయలుదేరారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న టీం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మహేష్ వర్మ మాట్లాడుతూ, వెనుకబడిన తరగతుల హక్కులు, రిజర్వేషన్లను కాలరాస్తూ, బిసిలను అణిచివేస్తున్న విధానాలను ఎండగడుతూ, బిసి సమాజాన్ని చైతన్యం చేస్తూ బిసిల సత్తా చాటుతున్న తీన్మార్ మల్లన్నకు మద్ధతుగా బిసి సమాజం ఉండాలని కోరారు. చరిత్రలో మిగిలి పోయే విధంగా మిర్యాలగూడ బిసి సభ జరుగుతుందని అన్నారు. సభ ఏర్పాట్లకు పాల్గొనేందుకు వెళ్లిన వారిలో తీన్మార్ మల్లన్న టీం నస్పూర్ మండల అధ్యక్షులు రాజశేఖర్, మంచిర్యాల పట్టణ ఉపాధ్యక్షులు దీపక్, జన్నారం మండల అధ్యక్షులు ఎండి ఇలియాస్, నాయకులు ప్రణయ్, అశోక్, ఆసిఫాబాద్ అధ్యక్షులు ఉప్పరి నాగేష్, క్రాంతి, కడారి శ్రీనివాస్, పిప్పిరె శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment