పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి

  • డి.ఎస్.పి ఎమ్మెల్సీ అభ్యర్థి మంద జ్యోతి

నస్పూర్, ఆర్.కె న్యూస్: ఈనెల 27న జరుగనున్న ఉమ్మడి మెదక్, కరీంనగర్,ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తే పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ధర్మ సమాజ్ పార్టీ  ఎమ్మెల్సీ అభ్యర్థి మంద జ్యోతి అన్నారు. ఆదివారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో విలేఖరులతో మాట్లాడుతూ, పూలే, అంబేడ్కర్, కాన్షీరాంల ఆశయ సాధనకు ధర్మ సమాజ్ పార్టీ పని చేస్తుందని, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అగ్రవర్ణాల వ్యాపారవేత్తలు తమ వ్యాపారాలు, సంపదను కాపాడుకోవడానికి పోటీ చేస్తున్నారని, ఓటర్లను డబ్బులు, మాయమాటలతో ప్రలోభాలకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అగ్రవర్ణాల వ్యాపారవేత్తలకు తగిన బుద్ధి చెప్పాలని పట్టభద్రులను కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల అభ్యున్నతికి ప్రభుత్వం సహకారం అందించడం ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ జిల్లా నాయకులు జంగపెల్లి రామస్వామి, రేగుంట రాకేష్, ఏదునూరి రమేష్, రాజు, కనకరాజు తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment