ఈనెల 25న మార్కండేయ దేవాలయ ద్వితీయ వార్షికోత్సవం

నస్పూర్, ఆర్.కె న్యూస్: నస్పూర్ పట్టణంలోని శ్రీ లక్ష్మి గణపతి శివ మార్కండేయ దుర్గామాత దేవాలయ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు ఈ నెల 25న నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు సిరిపురం రామన్న, కొండా శ్రీనివాస్ లు తెలిపారు. ఆదివారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ,  ఉదయం 9 నుంచి గంటలకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ మహోత్సవానికి నస్పూర్ పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని భగవంతుని కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ముఖ్య సలహాదారు చిలువేరు శరవంధం, ఉపాధ్యక్షులు చిప్ప రాజబాబు, దేవసాని నాగరాజు, తౌటం మల్లేష్, పద్మశాలి సంఘం మహిళా అధ్యక్షురాలు బండి పద్మ, సూరం శ్రీనివాస్, కోడూరి వెంకటేష్, మెండే వెంకన్న, కుంట రామన్న తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment