డిసెంబర్ 30న ఉద్యోగ క్రీడాకారులు, కళాకారుల ఆత్మీయ సమ్మేళనం 

నస్పూర్, ఆర్.కె న్యూస్: శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియం సీఈఆర్ క్లబ్ లో డిసెంబర్ 28న ఉద్యోగ క్రీడాకారులు, కళాకారులు, అధికారుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. గురువారం సాయంత్రం ఆత్మీయ సమ్మేళనం కో ఆర్డినేటర్ గూడూరి యాదిరెడ్డి, రిటైర్డ్ డీవైజీఎం (పర్సనల్) ప్రేమ్ కుమార్, సీనియర్ క్రీడాకారుడు గోవర్దన్ హైదరాబాద్ లో సింగరేణి సీఎండీ ఎన్. బలరాం , డైరెక్టర్ వెంకటేశ్వర్లుతో కలిసి ఆత్మీయ సమ్మేళనం గోడ ప్రతులు, బ్రోచర్ విడుదల చేశారు. ఈ నెల 30న జరగవలసిన ఆత్మీయ సమ్మేళనం అనివార్య కారణాల వల్ల డిసెంబర్ 28కి వాయిదా వేసి జరుపుకోవడం జరుగుతుందన్నారు. ఈ సమ్మేళనానికి శ్రీరాంపూర్ జీఎం ఎం శ్రీనివాస్ అధ్యక్షత వహిస్తారని, సింగరేణి సీఎండీ బలరాం ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. క్రీడాకారులు, రిటైర్డ్ క్రీడాకారులు, స్పోర్ట్స్ సూపర్వైజర్, కోఆర్డినేటర్లు పాల్గొంటారన్నారు. ఈ సందర్భంగా కమిటీ కన్వీనర్ జీ ఆదిరెడ్డి, కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ నెల 30న కోల్ ఇండియా కబడ్డీ పోటీలు, డిసెంబర్ 8 నుంచి సేఫ్టీ వారోత్సవాల ఉన్నందున ఆత్మీయ సమ్మేళనాన్ని డిసెంబర్ 28న జరుపుకోవడానికి కమిటీ సభ్యులు నిర్ణయించినట్లు  తెలిపారు. డిసెంబర్ 28న జరుగనున్న ఆత్మీయ సమ్మేళనంలో శ్రీరాంపూర్ ఏరియా క్రీడాకారులు, రిటైర్డ్ జీఎంలు, అధికారులు, కళాకారులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment