గ్రామాభివృద్ధి కోసం కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలి

మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ పిలుపు
మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేయాలని విస్తృత ప్రచారం

మంచిర్యాల, ఆర్.కె న్యూస్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించి, గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలని మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం నాడు ఆమె జిల్లాలోని దండేపల్లి, లక్షెట్టీపేట మండలాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల గెలుపును కోరుతూ సురేఖ సుడిగాలి పర్యటన చేశారు. దండేపల్లి మండలంలోని చెల్కగూడ, తానిమడుగు, దండేపల్లి, కర్ణపేట, నర్సాపూర్ గ్రామాల్లో పర్యటించారు. అనంతరం లక్షెట్టీపేట మండలంలోని వెంకట్రావుపేట్ గ్రామంలోనూ ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిస్తేనే గ్రామాలకు మెరుగైన నిధులు, అభివృద్ధి పనులు సాధ్యమవుతాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల యొక్క గుర్తులపై ఓటు వేసి, గ్రామ స్వరాజ్యం కోసం పాటుపడాలని ప్రజలను కోరారు. అమూల్యమైన ఓటును కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులకు వేసి, మీ గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించండి. గ్రామ ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది.” ఆమె పర్యటించిన గ్రామాల్లోని ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ ప్రచార కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment