నస్పూర్ విద్యార్థిని దేవర్షిణికి ఘన సన్మానం
అభినందించిన జిల్లా విద్యాశాఖాధికారి
నస్పూర్, ఆర్.కె న్యూస్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో నిర్వహించిన హ్యాండ్బాల్ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ 14 ఏళ్ల లోపు బాలికల జట్టు అద్భుత ప్రతిభ కనబరిచి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ నెల 28, 29 తేదీలలో సూర్యాపేట, మహబూబ్ నగర్ లలో జరిగిన రాష్ట్రస్థాయి ఎంపిక పోటీలు, టోర్నమెంట్లో ఈ జట్టు విజేతగా నిలిచింది.
నస్పూర్ ఆణిముత్యం దేవర్షిణి
ఈ విజేత జట్టులో సభ్యురాలైన నస్పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థిని ఎరికిల్ల దేవర్షిణిని మంచిర్యాల స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. జిల్లా విద్యాశాఖాధికారి యాదయ్య ముఖ్య అతిథిగా విచ్చేసి దేవర్షిణిని శాలువాతో సత్కరించి, అభినందనలు తెలిపారు. విద్యార్థులు క్రీడల్లో రాణించి జిల్లాకు పేరు తీసుకురావడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి ఎండీ యాకుబ్, ఎస్ ఓ సత్యనారాయణ మూర్తి, సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు సిరంగి గోపాల్, గాజుల శ్రీనివాస్, రేణి రాజయ్య, సుదర్శన్, కొండగుర్ల విఠల్, పున్నం సాంబమూర్తి పాల్గొన్నారు. అలాగే హ్యాండ్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు గోనె శ్యామ్ సుందర్ రావు, కోశాధికారి రమేష్ రెడ్డి, రాజలింగు, మంచిర్యాల బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బండి రమేష్, నస్పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు సూరెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.







