భద్రతా సిబ్బందికి తగిన రక్షణ వసతులు కల్పించాలి

శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ అధికారికి బీఎంఎస్ వినతి
పులుల సంచారం నేపథ్యంలో చెక్ పోస్టుల నిర్మాణం చేపట్టాలని డిమాండ్

నస్పూర్, ఆర్.కె న్యూస్: శ్రీరాంపూర్ ఏరియాలోని రక్షణ విభాగం, ఓపెన్ కాస్ట్ ఆవరణలో విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బందికి తగిన రక్షణ సౌకర్యాలు కల్పించాలని ఎస్ సీ ఎం కె ఎస్ – బీఎంఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ అధికారి సిహెచ్. వెంకటేశ్వర్లును కలిసి నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ సీ ఎం కె ఎస్ – బీఎంఎస్ నాయకులు మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ ఆస్తులను పరిరక్షించడంలో రక్షణ విభాగం ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారని, అయితే వారికి కనీస సౌకర్యాలు కల్పించడంలో యాజమాన్యం విఫలమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండ, వాన, చలి వంటి వాతావరణ పరిస్థితుల నుండి రక్షణ పొందేందుకు అనువైన షెల్టర్ గదులు లేక సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా శ్రీరాంపూర్ ఏరియాలో ప్రస్తుతం పులుల సంచారం ఎక్కువగా ఉన్నందున, రాత్రి సమయాల్లో విధులు నిర్వర్తించే సిబ్బంది ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని, తక్షణమే పటిష్టమైన చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలని కోరారు. శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ పరిధిలోని శాండ్ బంకర్ వద్ద, రామారావు పేట, బోర్వెల్ పాయింట్ల వద్ద వెంటనే రక్షణ షెల్టర్లు, చెక్ పోస్టుల నిర్మాణం చేపట్టాలని నాయకులు డిమాండ్ చేశారు. దీనిపై ప్రాజెక్ట్ అధికారి సిహెచ్. వెంకటేశ్వర్లు సానుకూలంగా స్పందిస్తూ, సిబ్బందికి రక్షణతో కూడిన వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఏరియా సెక్యూరిటీ అధికారి జక్కా రెడ్డితో కూడా వివిధ సమస్యలపై చర్చించగా, సానుకూల పరిష్కారం చూపుతామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఎంఎస్ ఏరియా ఉపాధ్యక్షులు నాతాడి శ్రీధర్ రెడ్డి, ఏరియా సెక్రటరీ రాగం రాజేందర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ జల్లా తిరుపతి పాల్గొన్నారు. వీరితో పాటు పిట్ సెక్రటరీలు నాగార్జున నాయక్, కొమ్మ బాపు, మరియు నాయకులు చొప్పరి శ్రీకాంత్, నీరటి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment