రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించి కంపెనీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి

ఉద్యోగ సంక్షేమానికి పెద్దపీట
మూడు భూగర్భ గనులలో వంద శాతానికి పైగా ఉత్పత్తి
శ్రీరాంపూర్ జీఎం మునిగంటి శ్రీనివాస్

నస్పూర్, ఆర్.కె న్యూస్: అందరం కలిసికట్టుగా, సమిష్టి కృషితో, రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించి కంపెనీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని జనరల్ మేనేజర్ పిలుపునిచ్చారు. గురువారం జీఎం కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీరాంపూర్ ఏరియాలో డిసెంబర్ నెలలో సాధించిన ఉత్పత్తి వివరాలను, ఏరియా ప్రగతిని ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) మునిగంటి శ్రీనివాస్ వెల్లడించారు. డిసెంబర్ నెలలో ఏరియాలోని భూగర్భ, ఉపరితల గనులు కలిపి మొత్తం 57 శాతం ఉత్పత్తి సాధించినట్లు తెలిపారు. ముఖ్యంగా ఏరియాలోని ఆర్.కె 5, ఆర్.కె న్యూటెక్, ఎస్.ఆర్.పి 1 భూగర్భ గనులు నూరు శాతానికి పైగా ఉత్పత్తి సాధించడం హర్షనీయమని జీఎం పేర్కొన్నారు. శ్రీరాంపూర్ ఉపరితల గనిలో రెండు ఓబి కాంట్రాక్టు పనులు నిలిచిపోవడంతో ఉత్పత్తిలో కొంత తగ్గుదల నమోదైందని వివరించారు. అయితే, ప్రస్తుతం శ్రీరాంపూర్ ఓసీపీలో నూతన కాంట్రాక్టర్ పనులు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన మూడు నెలల్లో సాధ్యమైనంత మేర అధిక బొగ్గు ఉత్పత్తి సాధించి, కంపెనీ నిర్దేశించిన వార్షిక లక్ష్యాలను చేరుకోవడానికి కృషి చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏరియాలో పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించి 338 మందికి నిర్ణీత సమయంలో సర్వీసు లింక్డ్ ప్రమోషన్స్ పూర్తి చేసినట్లు జీఎం తెలిపారు. ఉద్యోగుల క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు వర్క్స్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత నెల 30, 31 తేదీలలో క్రీడాపోటీలు ఘనంగా నిర్వహించామన్నారు. అలాగే, డిసెంబర్ 8 నుండి 19 వరకు 56వ వార్షిక రక్షణ పక్షోత్సవాలను అన్ని గనులు, విభాగాలలో విజయవంతంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఏరియాలోని అంతర్గత అభ్యర్థులకు టెండల్, టెండల్ సూపర్వైజర్, రోప్ స్లైసర్ తదితర ఖాళీల భర్తీకి ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించామన్నారు. సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు వృత్తి శిక్షణ కోర్సులను ప్రారంభించినట్లు తెలిపారు. ఏరియాలో ఇప్పటివరకు 9,724 సీపీఆర్ఎమ్ఎస్ కార్డులు అందించామని వివరించారు. ఏరియాలో ఇప్పటి వరకు 4,333 మంది ఉద్యోగులు మెడికల్ ఇన్వాలిడేషన్ పొందగా, వారిలో 3,791 మంది వారసులకు కారుణ్య ఉద్యోగ నియామక ఉత్తర్వులు అందించామని జీఎం తెలిపారు. అదే విధంగా 275 మంది 25 లక్షల చొప్పున ఏకమొత్తం నగదు పరిహారం తీసుకోగా, ఈ సంవత్సరం 20 మంది ఎం.ఎం.సి పథకాన్ని ఎంచుకున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎం ఎన్. సత్యనారాయణ, డీజీఎం (పర్సనల్) ఎస్. అనిల్ కుమార్, డీజీఎం (ఐఈడీ) రాజన్న, సీనియర్ పీవో ఎస్. సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment