- విజేతలకు నగదు బహుమతులు
- ఆదివారం ఉదయం 10 గంటలకు నిర్వహణ
నస్పూర్, ఆర్.కె న్యూస్: టీఎన్జీవోస్ హౌసింగ్ సొసైటీ కాలనీలో సంక్రాంతి సంబరాల నిర్వహణపై బుధవారం జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి, కార్యనిర్వాహక అధ్యక్షుడు గుండేటి యోగేశ్వర్ సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా వచ్చే ఆదివారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ రోడ్డులోని వినాయక మండపం వద్ద మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ పోటీల్లో టీఎన్జీవోల కుటుంబ సభ్యులతో పాటు స్థానిక మహిళలు కూడా పాల్గొనవచ్చు. ప్రతిభ కనబరిచిన విజేతలకు వరుసగా రూ. 3000, రూ. 2000, రూ. 1000 నగదు బహుమతులు అందజేస్తారు. పోటీలో పాల్గొన్న ప్రతి మహిళకు, పిల్లలకు ప్రత్యేక ప్రోత్సాహక బహుమతులు ఉంటాయి. ఆసక్తి గల మహిళలు తమ పేర్లను ముందుగానే నమోదు చేయించుకోవాలని కమిటీ సభ్యులు కోరారు. వివరాల కోసం ఎ. సునీత (70133 52118), పి. స్వర్ణలత (81795 67012), డి. కమల (94930 01468), వి. పద్మాంజలి (90105 00073)లను సంప్రదించాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి పొన్నమల్లయ్య, జిల్లా నాయకులు హబీబ్ హుస్సేన్, భూముల రామ్మోహన్, సీపతి బాబురావు, సైండ్ల మొండయ్య పాల్గొన్నారు. మహిళా బాధ్యులు అరుణ, సునీత, స్వర్ణ, రమాదేవి, పుష్పలతతో పాటు ఇతర కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు.







