రుద్ర హోమం, అన్నప్రసాద వితరణ
నస్పూర్, ఆర్.కె న్యూస్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ శ్రీ లక్ష్మి గణపతి శివ మార్కండేయ దుర్గ మాత దేవాలయంలో ఈ నెల 21న మార్కండేయ జయంతి వేడుకలు నిర్వహించనున్నారు. మాఘ శుద్ధ తదియ బుధవారం పురస్కరించుకుని ఉదయం ఆలయ ప్రాంగణంలో జెండా ఆవిష్కరణ, ప్రత్యేక రుద్ర హోమం చేపట్టనున్నట్లు ఆలయ కమిటీ, పద్మశాలి సంఘం ప్రతినిధులు తెలిపారు. మార్కండేయ జయంతిని పురస్కరించుకుని నిర్వహించే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పద్మశాలి కులబాంధవులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. హోమ పూజల అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ ఉంటుందని పేర్కొన్నారు. ఉత్సవాలకు సంబంధించి ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు ఏర్పాట్లు పూర్తి చేశారు.








