మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేయాలి: బాల్క సుమన్

  • కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలని కార్యకర్తలకు పిలుపు

నస్పూర్, ఆర్.కె న్యూస్: రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మంచిర్యాల జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ పిలుపునిచ్చారు. గురువారం నస్పూర్ లోని పార్టీ కార్యాలయంలో జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తు లేకపోయినా బీఆర్ఎస్ మద్దతుదారులు 41 శాతం స్థానాల్లో గెలిచి సత్తా చాటారని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఆ పార్టీ అరాచకాలను ఇంటింటికి వివరించాలని సూచించారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూనే, కాంగ్రెస్ ఎగవేసిన హామీలపై బాకీ కార్డులను ప్రజలకు అందజేయాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిని గాలికొదిలేసి ప్రతిపక్షాలు, విలేకరులపై అక్రమ కేసులు బనాయిస్తోందని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో కార్యకర్తలంతా సమిష్టిగా పనిచేసి గులాబీ జెండా సత్తా చాటాలని కోరారు. ఈ సమావేశంలో నస్పూర్ పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, మంచిర్యాల పట్టణ అధ్యక్షుడు గాదె సత్యం, నాయకులు నడిపెల్లి విజిత్ రావు, మూల రాజిరెడ్డి, డాక్టర్ రాజారమేష్, అత్తి సరోజ, నల్మాస్ కాంతయ్య, పల్లె భూమేష్, గోగుల రవీందర్రెడ్డి, 4 మున్సిపాలిటీలు, మంచిర్యాల కార్పొరేషన్ కు చెందిన ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment