రాజ్యాంగ పరిరక్షణకు సమైక్యంగా పోరాడాలి

🔴 నస్పూర్‌లో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

నస్పూర్, ఆర్.కె న్యూస్: భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) నస్పూర్ పట్టణ సమితి ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు షిర్కే సెంటర్లో ఘనంగా జరిగాయి. పట్టణ కార్యదర్శి మిర్యాల రాజేశ్వర రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. దేశ ప్రజల మౌలిక అవసరాలు, హక్కులను పరిరక్షించేలా బి.ఆర్. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నాయకులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గ సభ్యుడు లింగం రవి, ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి ముస్కె సమ్మయ్య మాట్లాడుతూ రాజ్యాంగంలోని అనేక ఆర్టికల్స్ దేశ భవిష్యత్తుకు దిక్సూచిగా నిలిచాయన్నారు. అయితే ప్రస్తుత పాలకులు రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ, సామాన్య ప్రజలకు చట్టాలను దూరం చేస్తున్నారని విమర్శించారు. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా చట్టాలను సవరించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఈ ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు ప్రజలంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో జిల్లా సమితి సభ్యులు కొట్టే కిషన్ రావు, నాయకులు కొట్టే శంకరయ్య, అల్లా లచ్చిరెడ్డి, గుడెల్లి రాజయ్య, కంచెం పోషం, జోగులా ఆంజనేయులు, ఎండి రషీద్, కోడి వెంకటేశం, నాగపూరి సమ్మయ్య, వేముల సంతోష్, జిపి రావు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment