నస్పూర్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన చిలగాని బొడ్డయ్య
నస్పూర్, ఆర్.కె న్యూస్: నస్పూర్ మండల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం సంఘ కార్యాలయ ఆవరణలో ఘనంగా జరిగాయి. మండల అధ్యక్షుడు చిలగాని బొడ్డయ్య జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం సమర్పించారు. రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిస్తూ దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలను గుర్తెరిగి సమాజ శ్రేయస్సు కోసం కృషి చేయాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శ్రీ భక్త మార్కండేయ దేవాలయ కమిటీ అధ్యక్షుడు సిరిపురం రామన్న, పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యదర్శి దేవసాని నాగరాజు, సంఘ సభ్యులు మెండె వెంకన్న, కొండా శ్రీనివాస్, కుందారపు రమేష్, తౌటం మల్లేష్, సబ్బని భాస్కర్, కుందారపు రాములు, క్యాతం రాజేష్, కుసుమ శంకర్, సూరం శ్రీనివాస్, సట్కూరి రవీందర్, కోడూరి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.







