🔴 సీఎండీ జ్యోతి బుద్ధ ప్రకాష్
🟢 నూతన చైర్మన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్టీపీపీ ఈడీ చిరంజీవి
ఆర్.కె న్యూస్, నస్పూర్: సింగరేణి సంస్థను మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్లేందుకు అధికారులు, కార్మికులు సమన్వయంతో పనిచేయాలని సంస్థ నూతన చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాష్ ఆకాంక్షించారు. గురువారం హైదరాబాదులోని సింగరేణి ప్రధాన కార్యాలయంలో ఎస్టీపీపీ ఈడీ చిరంజీవి ఎస్టీపీపీ అధికారుల సంఘం అధ్యక్షుడు పంతులతో కలిసి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన జ్యోతి బుద్ధ ప్రకాష్‌కు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సంస్థ కార్యకలాపాలు, ఎస్టీపీపీ ప్రగతికి సంబంధించిన పలు అంశాలపై వారు చర్చించారు. నూతన సీఎండీ నాయకత్వంలో సంస్థ మరిన్ని విజయాలు సాధించాలని వారు ఈ సందర్భంగా ఆకాంక్షించారు. సీఎండీకి అధికారుల తరపున పూర్తి సహకారం అందిస్తామని ఈడీ చిరంజీవి వివరించారు. సంస్థ లక్ష్యాల సాధనలో ప్రతి విభాగాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతామని జ్యోతి బుద్ధ ప్రకాష్ స్పష్టం చేశారు.







