శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్‌కు బిఎంఎస్ నాయకుల వినతి
నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణి ఆస్తుల రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న రక్షణ సిబ్బందికి యుద్ధ ప్రాతిపదికన మౌలిక సదుపాయాలు కల్పించాలని బిఎంఎస్ శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షుడు నాతాడి శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎస్ అండ్ పీసీ పిట్ కార్యదర్శి కొమ్మ బాపు ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్, ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ సల్ల జక్కారెడ్డిని సోమవారం కలిసి ఆయన వినతి పత్రం అందజేశారు. సింగరేణిలో పనిచేస్తున్న సెక్యూరిటీ సిబ్బందికి పాలికర్బోనట్ స్టిక్ లు, హైపవర్ టార్చ్ లైట్లు వెంటనే పంపిణీ చేయాలని కోరారు. ఈ ఆధునిక పరికరాలు అందించడం ద్వారా సంస్థ ఆస్తులను మరింత సమర్థవంతంగా కాపాడవచ్చని వివరించారు. విధుల నిర్వహణలో సిబ్బంది సామర్థ్యాన్ని పెంచేందుకు యాజమాన్యం చొరవ చూపాలని సూచించారు. సింగరేణి ఆస్తుల పరిరక్షణలో సెక్యూరిటీ విభాగం పాత్ర ఎంతో కీలకమని శ్రీధర్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బిఎంఎస్ నాయకులు కుమ్మరి చంద్రశేఖర్, కుంట రాజు, ఆకుతోట బాలకృష్ణ, అష్టకాల శ్రీధర్, ఐలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.







