సంస్థ అభివృద్ధి, కార్మికుల సంక్షేమమే లక్ష్యం: ఈడీ చిరంజీవి
జైపూర్, ఆర్.కె న్యూస్: జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ (ఎస్టీపీపీ) పరిపాలనా భవనంలో గురువారం ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ 2026 నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఎస్టీపీపీ ఈడీ సిహెచ్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంస్థ అభివృద్ధి, ఉత్పత్తి పెంపు, సాంకేతిక పురోగతిలో ఉద్యోగుల పాత్ర కీలకమని ఆయన పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమం కోసం యాజమాన్యం తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా వివరించారు.
ఈడీ చిరంజీవి క్యాలెండర్‌ను ఆవిష్కరించి జీఎం (ఈ అండ్ ఎం) ఎం. నరసింహ రావు, జీఎం (పిసిఎస్, ఓ అండ్ ఎం) ఎం. మదన్ మోహన్, అసోసియేషన్ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి అంతోటి నాగేశ్వర్ రావులకు క్యాలెండర్ ప్రతులను అందజేశారు. సింగరేణి సంస్థ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తుందని చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు. సాంకేతిక అభివృద్ధిలో సంస్థ ముందంజలో ఉందని చెప్పారు.
అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అంతోటి నాగేశ్వర్ రావు మాట్లాడుతూ సంస్థ అభ్యున్నతికి సంపూర్ణ మద్దతు ఇస్తామని ప్రకటించారు. ఉద్యోగుల సంక్షేమం, సామాజిక న్యాయం కోసం అసోసియేషన్ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎంఓఏఐ అధ్యక్షుడు పంతులా, డీజీఎం (పర్సనల్) డి కిరణ్ బాబు, ఎస్టీపీపీ ఎస్సీ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు పులి సురేష్, లైజన్ ఆఫీసర్ జనగామ శ్రీనివాస్, పలువురు అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.







