నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో హోలీ వేడుకలు జరిగాయి. పండుగను పురస్కరించుకుని యూనియన్ నాయకులు మంగళవారం ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్, ఏఎస్ఓ విజయ్ కుమార్, డిప్యూటీ పర్సనల్ మేనేజర్ అనిల్ కుమార్ సహా ఇతర అధికారులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా, కార్మికులు అధికారుల మధ్య సమన్వయం పెంచే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. హోలీ పండుగ మానవ సంబంధాల మధ్య ఉన్న బేధాలను తొలగిస్తుందని యూనియన్ నాయకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. చిన్న పెద్ద, హోదా అనే తారతమ్యం లేకుండా బేషజాలకు పోకుండా అందరూ కలిసి మెలిసి వేడుకలు జరుపుకోవాలని కోరారు. సింగరేణి కార్మికులు, అధికారులు, కాంట్రాక్టు కార్మికులతో పాటు ప్రజలందరి జీవితాల్లో హోలీ రంగులు నింపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్రాంచ్ అధ్యక్షుడు గుల్ల బాలాజీ, కార్యదర్శి కస్తూరి చంద్రశేఖర్, చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంగళ శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు తోడే సుధాకర్, నాయకులు పెరుక సదానందం, వెంకటరెడ్డి, సిరికొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
24







