బాధితుడి కుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: మంచిర్యాల నియోజకవర్గం దండేపల్లి మండలం కొర్విచెల్మ గ్రామానికి చెందిన చుంచు వెంకటేష్ చికిత్స నిమిత్తం మంజూరైన రూ. 2,50,000 విలువైన ఎల్ఓసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) పత్రాన్ని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు శనివారం బాధితుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వెంకటేష్‌కు మెరుగైన వైద్యం అందించే లక్ష్యంతో ప్రభుత్వం నుంచి ఈ నిధులు మంజూరు చేయించారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నిరుపేదలకు వైద్య ఖర్చుల భారం తగ్గించేందుకు ఈ సాయం ఎంతో తోడ్పడనుంది. ఆపదలో ఉన్న వారికి ప్రభుత్వం నుంచి తగిన సహకారం అందుతుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. వైద్య ఖర్చుల నిమిత్తం సకాలంలో స్పందించి ఆర్థిక సాయం అందించడం పట్ల బాధితుడి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.







