పెన్షన్ పెంపు కోసం సింగరేణి విశ్రాంత కార్మికుల గర్జన

ఢిల్లీ జంతర్ మంతర్ ధర్నాకు సంఘీభావం.. నల్ల బ్యాడ్జీలతో నిరసన

మంచిర్యాల, ఆర్.కె న్యూస్: కోల్ ఇండియా పరిధిలోని బొగ్గు పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో సింగరేణి విశ్రాంత ఉద్యోగులు సోమవారం భారీ ధర్నా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఐబి చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి, ప్లే కార్డులతో నిరసన వ్యక్తం చేశారు. న్యూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కోల్ పెన్షనర్లు చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి మద్దతుగా జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంఘం ఈ పిలుపునిచ్చింది. గత 28 ఏళ్లుగా పెన్షన్ పెంచకపోవడంపై విశ్రాంత కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

1998లో కుదిరిన ఒప్పందం ప్రకారం మార్కెట్ ధరలకు అనుగుణంగా ప్రతి మూడేళ్లకోసారి పెన్షన్ సవరించాల్సి ఉన్నా, యాజమాన్యం పట్టించుకోవడం లేదని సంఘం నేతలు విమర్శించారు. కరువు భత్యంతో కూడిన 50 శాతం కోల్ మైన్స్ పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి విశ్రాంత ఉద్యోగులకు కనీస పెన్షన్ 15,000 రూపాయలు చెల్లించాలని కోరారు. సీపీఎంఆర్ఎస్ హెల్త్ కార్డు పరిమితిని 8 లక్షల నుండి 25 లక్షల రూపాయలకు పెంచి వైద్య సౌకర్యాలు మెరుగుపరచాలన్నారు. 2017 జనవరి నుండి పెరిగిన గ్రాడ్యుటీ సీలింగ్ 20 లక్షల రూపాయలను విశ్రాంత ఉద్యోగులందరికీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.

గోల్డెన్ హ్యాండ్ షేక్ పద్ధతిలో పదవీ విరమణ పొందిన వేలాది మంది కార్మికులకు ప్రభుత్వం ఇచ్చే ఆసరా పెన్షన్ కంటే తక్కువగా, నెలకు 350 నుండి 1000 రూపాయల పెన్షన్ మాత్రమే అందుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతటి స్వల్ప మొత్తంతో జీవనం సాగించడం భారంగా మారిందని పేర్కొన్నారు. ధరల ద్రవ్యోల్మానం 300 శాతం పెరిగినప్పటికీ, పెన్షన్ పెంచకపోవడంతో వృద్ధాప్యంలో కనీస అవసరాలు తీర్చుకోలేక దారిద్య్రంలో మగ్గుతున్నామని వాపోయారు. తక్కువ పెన్షన్ పొందుతున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్లు మంజూరు చేయాలని, ఇల్లు లేని వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, అర్హులైన వారికి తెల్ల రేషన్ కార్డులు, రాజీవ్ ఆరోగ్య శ్రీ కార్డులు అందజేయాలని కోరారు.

సింగరేణి సంస్థలో మారుపేర్ల మార్పు ప్రక్రియ పూర్తి చేయాలని, నూతన అండర్ గ్రౌండ్ బొగ్గు బావులను తక్షణమే ప్రారంభించాలని నేతలు డిమాండ్ చేశారు. సింగరేణి మెడికల్ బోర్డును పునరుద్ధరించి, ఏరియా ఆసుపత్రులలో గతంలో మాదిరిగానే ఇన్ పేషెంట్లకు ఉచిత వైద్యం అందించాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో మంచిర్యాల, శ్రీరాంపూర్, మందమర్రి, రామకృష్ణాపూర్, బెల్లంపల్లి ప్రాంతాల నుండి వయో వృద్ధులైన విశ్రాంత ఉద్యోగులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ ధర్నాలో సంఘం అధ్యక్షులు గజెల్లి వెంకటయ్య, గౌరవ అధ్యక్షులు రాళ్లబండి రాజన్న, ఉపాధ్యక్షుడు పానగంటి పోషం, సలహాదారుడు మహేందర్ రాజు, నాయకులు రామ్ రావేందర్, ఆడెపు రాజేశం, రేణికుంట కొమురయ్య, బి. రాజన్న, బింగి రాజేశం, గజెల్లి సుదర్శన్, మేకల రమేష్, శ్రీనివాస్, కాలువల నర్సయ్య, అడిచర్ల రాజేశం, రమేష్, మురహరి, నిచ్చకోళ్ల అంజన్న, పోతరాజుల చంద్రయ్య, రాంబాబు, గోపతి లక్ష్మణ్, సర్వేశ్వర చారి, దేవులపల్లి రామస్వామి, రాజన్న గౌడ్, భీంసేన్, హనుమాండ్ల బుచ్చయ్య, విఘ్నేష్, రాజ్ మొహమ్మద్, చుక్క నారాయణ, కె. దేవయ్య, ఎంఎస్ అలీ భేగ్, మంచాల రామయ్య, గుజ్జ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment