- నస్పూర్ పట్టణ బిఆర్ఎస్ అధ్యక్షుడు అక్కురి సుబ్బన్న
- నస్పూర్ లో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
నస్పూర్, ఆర్.కె న్యూస్: విద్య ద్వారానే సమాజంలో సామాజిక సమానత్వం సాధ్యమవుతుందని నస్పూర్ పట్టణ బిఆర్ఎస్ అధ్యక్షుడు అక్కురి సుబ్బన్న పేర్కొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను శనివారం నస్పూర్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్బన్న మాట్లాడుతూ మహనీయ సామాజిక సంస్కర్త జ్యోతిరావు పూలే సమాజంలో ఉన్న అసమానతలు, అణచివేతలపై అలుపెరగని పోరాటం చేశారని కొనియాడారు. దళితులు, మహిళల అభ్యున్నతి కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేశారని వివరించారు. పూలే ప్రారంభించిన విద్యా ఉద్యమం నేటికీ ఎందరికో స్ఫూర్తినిస్తోందని తెలిపారు. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ సామాజిక న్యాయం, సౌభ్రాతృత్వం ఉన్న సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని సుబ్బన్న పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి మేరుగు పవన్ కుమార్, టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే సురేందర్ రెడ్డి, కార్పొరేటర్ గుమ్మడి శ్రీనివాస్, శ్రీరాంపూర్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ బండి రమేష్, మాజీ కౌన్సిలర్ వంగ తిరుపతి, మాజీ కో ఆప్షన్ సభ్యుడు పి జనార్ధన్, డివిజన్ ఇన్చార్జీలు ఆకునూరు సంపత్, రుకుం తిరుమల్, యూత్ నాయకులు కాటం రాజు, దగ్గుల మధు, కందుల ప్రశాంత్, మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.







