- ఆర్.కె-7 గ్రూప్ ఏజెంట్ రాజేందర్
- ఆర్.కె న్యూటెక్ గనిలో జూనియర్ మైనింగ్ అధికారి కరుణాకర్ రాజు పదవీ విరమణ
నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణి సంస్థ అభివృద్ధిలోనూ, ఉత్పత్తి లక్ష్యాల సాధనలోనూ ఉద్యోగుల సేవలు మరువలేనివని ఆర్.కె-7 గ్రూప్ ఏజెంట్ కె. రాజేందర్ పేర్కొన్నారు. శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్.కె న్యూటెక్ గనిలో జూనియర్ మైనింగ్ అధికారిగా సుదీర్ఘకాలం విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన కరుణాకర్ రాజును గురువారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో ఎస్టీపీపీ డీజీఎం ఈ. స్వామి రాజు, గని మేనేజర్ కె. శ్రీనివాసుతో కలిసి రాజేందర్ ఆయనను శాలువాతో సత్కరించారు. సుదీర్ఘ సర్వీసు కాలంలో కరుణాకర్ రాజు కంపెనీకి అందించిన సేవలను అధికారులు ఈ సందర్భంగా కొనియాడారు. విధి నిర్వహణలో ఆయన చూపిన నిబద్ధత అందరికీ ఆదర్శనీయమని ప్రశంసించారు. పదవీ విరమణ తర్వాత ఆయన శేష జీవితం ఆయురారోగ్యాలతో సుఖసంతోషంగా గడవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సేఫ్టీ అధికారి కొట్టే రమేష్, సీనియర్ సంక్షేమ అధికారి పాల్ సృజన్, పిట్ కార్యదర్శి ఆకుల లక్ష్మణ్, ఇంజనీర్ కృష్ణ, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డి, ఐఎన్‌టీయూసీ కేంద్ర నాయకుడు గరిగె స్వామి, గని అధికారులు, కార్మిక సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.







