32 మందిలో 25 మందికి 500 పైగా మార్కులు.. 100 శాతం ఉత్తీర్ణత
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: బుధవారం వెలువడిన తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో మంచిర్యాల నారాయణ హైస్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. పాఠశాలకు చెందిన విద్యార్థులందరూ ఉత్తీర్ణత సాధించి వంద శాతం ఫలితాలు నమోదు చేశారు. మొత్తం 32 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 25 మంది 500 కంటే ఎక్కువ మార్కులు సాధించి జిల్లా, రాష్ట్ర స్థాయి ర్యాంకులను కైవసం చేసుకున్నారు. విద్యార్థుల ప్రతిభతో పాఠశాల స్థాయిని మరోసారి చాటినట్లు నిర్వాహకులు తెలిపారు. విద్యార్థుల ఘన విజయంపై పాఠశాల డీజీఎం వెంకటరమణ రెడ్డి, ఏజీఎం చైతన్య రావు, ప్రిన్సిపాల్ స్రవంతి స్పందించారు. విద్యార్థుల పట్టుదల, క్రమశిక్షణతో పాటు ఉపాధ్యాయుల నిరంతర బోధన వల్లే ఈ అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని చదివిన విద్యార్థులకు, వెన్నంటి ప్రోత్సహించిన తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేశారు. డీన్ వెంకటస్వామి, ఏజీఎం అనాలసిస్ రాజేందర్, ఏఓ కిషన్ ఈ విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయ బృందం ప్రత్యేక అభినందనలు తెలిపింది. విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఫలితాలు వెలువడిన అనంతరం పాఠశాల ఆవరణలో టపాసులు కాల్చి విద్యార్థులు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు.







