రేపు ఎంఎన్ఆర్ గార్డెన్స్‌లో సింగరేణి పరిరక్షణ సదస్సు: టీబీజీకేఎస్

నస్పూర్, ఆర్.కె న్యూస్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీష్ రావు ఆధ్వర్యంలో జూలై 1న క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఎంఎన్ఆర్ గార్డెన్స్‌లో నిర్వహించబోయే “సింగరేణి పరిరక్షణ సదస్సు” గోడప్రతులను ఆర్.కె-7 గనిపై మంగళవారం విడుదల చేశారు. టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు మిరియాల రాజిరెడ్డి ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, ఏరియా వైస్ ప్రెసిడెంట్ బండి రమేష్ పాల్గొని మాట్లాడారు. సింగరేణిలో జరుగుతున్న అవినీతి, కుంభకోణాలపై కార్మికులను చైతన్యపరచడానికే ఈ సదస్సు అని, కార్మికులంతా పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఉద్యోగ విరమణ పొందుతున్న టెండల్ సూపర్‌వైజర్ మల్లేష్‌ను యూనియన్ తరపున ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఏరియా సెక్రటరీలు తొంగల రమేష్, మహిపాల్ రెడ్డి, అసిస్టెంట్ పిట్ సెక్రటరీ పాదం శ్రీనివాస్, షిఫ్ట్ సెక్రటరీ గంధం గురుమూర్తి, గని నాయకులు మల్లేష్, కృష్ణమూర్తి, రాజేందర్, కొప్పుల రవీందర్, దార వంశీకృష్ణ, రంజిత్ పటేల్, ముత్యం రాకేష్, కత్తి రాకేష్, రవి, అజిత్ రావు, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment