- నిర్మల్ జిల్లా కలెక్టర్ బవేష్ మిశ్రా
సోన్, ఆర్.కె న్యూస్: సోన్ మండల కేంద్రంలో గల రైతు వేదిక లో రైతు నేస్తం కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా హాజరై పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రైతులు ‘రైతు నేస్తం’ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని సూచించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా పంటల సాగు చేపట్టాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. ఎల్ నినో ప్రభావం ఉన్నందువల్ల రైతులు తక్కువ వర్షపాతం గల పంటల వైపు మొగ్గు చూపాలన్నారు. అనంతరం ఉత్తమ సేవలందించిన రైతులు, వ్యవసాయ అధికారులను అభినందించి జ్ఞాపికలు అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అంజిప్రసాద్, ఉద్యానవన శాఖ అధికారి రమణ, పీఏసీఎస్ చైర్మన్ కృష్ణ ప్రసాద్ రెడ్డి, తహశీల్దార్ సంతోష్, మండల వ్యవసాయ అధికారి వినోద్ కుమార్, ఏఈఓ ఉమా వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.







