పీఆర్టీయూ-టీఎస్ అభినందనలు
నస్పూర్, ఆర్.కె న్యూస్: 2026–27 విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వం నిర్దేశించిన విద్యార్థుల నమోదు లక్ష్యాన్ని విజయవంతంగా అధిగమించి, తెలంగాణ రాష్ట్రంలోనే మంచిర్యాల జిల్లా మొదటి స్థానంలో నిలవడం విద్యాశాఖ సమిష్టి కృషికి నిదర్శనమని ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ – తెలంగాణ స్టేట్ మంచిర్యాల జిల్లా శాఖ బుధవారం ఒక ప్రకటనలో కొనియాడింది. ఈ విజయానికి కృషి చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి, మండల విద్యాధికారులు, సెక్టోరల్ ఆఫీసర్లు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యా వాలంటీర్లు, పాఠశాల నిర్వహణ కమిటీలు, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, దాతలకు పీఆర్టీయూ-టీఎస్ జిల్లా పక్షాన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొట్టే శంకర్, బచ్చ మోహన్ రావు అభినందనలు తెలిపారు. వేసవి సెలవుల నుంచే ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న నాణ్యమైన విద్య, డిజిటల్ బోధన, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాలపై అవగాహన కల్పించి నమోదును విజయవంతం చేసిన ఉపాధ్యాయుల అంకితభావాన్ని నేతలు ప్రశంసించారు. భవిష్యత్తులోనూ ఇదే ఉత్సాహంతో విద్యా ప్రమాణాలను మరింత పెంచి, రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.




వర్షపు నీరు నిలిచిపోయిన రహదారులు, పొంగిపొర్లుతున్న డ్రైనేజీల పరిస్థితిని స్వయంగా తనిఖీ చేసి, నీటి పారుదల వేగవంతం అయ్యేలా తక్షణ చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు.ముఖ్యంగా కార్పొరేషన్ పరిధిలోని 9వ డివిజన్ తిరుమల టౌన్షిప్, 32వ డివిజన్ రాంనగర్ ఆదిపరాశక్తి దేవాలయం వద్ద వాగులు, డ్రైనేజీలు పొంగిపొర్లుతుండటంతో, జేసీబీ సహాయంతో తక్షణమే పూడిక తొలగించి నీటిని సురక్షితంగా మళ్లించే ఏర్పాట్లు చేశారు.స్థానిక ప్రజల నుంచి సమస్యలపై సమాచారం అందగానే స్పందించిన మేయర్, స్వయంగా ఆయా డివిజన్లలో పర్యటిస్తూ మున్సిపల్ అధికారులను, పారిశుధ్య సిబ్బందిని అప్రమత్తం చేశారు. వర్షాకాలంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు తొలగిస్తూ డ్రైనేజీల్లో నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా పర్యవేక్షించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు నిరంతరం వేగవంతమైన సేవలు అందుబాటులో ఉంచాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్‌తో పాటు స్థానిక కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది, ఆయా డివిజన్ల ప్రజలు పాల్గొన్నారు.