సోన్‌లో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

సోన్, ఆర్.కె న్యూస్: సోన్ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి , నివాళులర్పించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. దేశంలో సమాచార సాంకేతిక (ఐటి) విప్లవానికి నాంది పలికిన ఘనత రాజీవ్ గాంధీ దేనని కొనియాడారు. 18 ఏళ్లకే యువతకు ఓటు హక్కు కల్పించి, పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా అధికార వికేంద్రీకరణకు ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు. దేశ పురోగతి కోసం ఆయన చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మొయినుద్దీన్, ఆత్మ డైరెక్టర్లు గాండ్ల లింగన్న, చిలారి సాయికుమార్ ,మాజీ వైస్ ఎంపీపీ మురళీధర్ రెడ్డి, మండల జనరల్ సెక్రటరీ లు అజహర్, రాజా రెడ్డి, జిల్లా సోషల్ మీడియా కో ఆర్డినేటర్ ప్రేమ్, మాజీ ఉప సర్పంచ్ దాసరి రాజేశ్వర్, మాజీ ఎంపీటీసీ  కుమ్మరి లింగన్న, దేవేందర్, కంచెట్టి , సాయి కుమార్,రమేష్, అర్బాస్, ఇస్మాయిల్, తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment