నస్పూర్, ఆర్.కె న్యూస్: మంచిర్యాల జిల్లా నస్పూర్ మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఎంఆర్‌పీఎస్ మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎంఆర్‌పీఎస్ జిల్లా ఇన్‌చార్జి లింగంపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. మండల నూతన అధ్యక్షుడిగా బచ్చల రమేష్, అధికార ప్రతినిధిగా గుంపుల స్వామి, ప్రధాన కార్యదర్శులుగా కొయ్యల శేఖర్, కంపెల్లి విజయ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ దళితుల హక్కుల పరిరక్షణకు, సామాజిక న్యాయ సాధనకు నిరంతరం ఐక్యంగా కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల నియోజకవర్గ ఇన్‌చార్జి చిప్పకుర్తి మల్లేష్, నస్పూర్ మండల ఇన్‌చార్జి గద్దల బానయ్య, నాయకులు సుందిల్ల మల్లేష్, ఇరికిల్ల పురుషోత్తం, నక్క అంజన్న, మంథని మల్లేష్, చుంచు శంకర్ వర్మ, జూపెల్లి సాయిలు తదితరులు పాల్గొన్నారు.
28







