మహిళలు స్వయం ఉపాధితో కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలి

నూతన బ్యూటీ పార్లర్‌ను ప్రారంభించిన సేవా అధ్యక్షురాలు మునిగంటి ఉమారాణి

నస్పూర్, ఆర్.కె న్యూస్: స్వయం ఉపాధి ద్వారా మహిళలు సొంత కాళ్లపై నిలబడి తమ కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలని శ్రీరాంపూర్ ఏరియా సేవా సమితి అధ్యక్షురాలు మునిగంటి ఉమారాణి పేర్కొన్నారు. సింగరేణి సేవా సమితిలో శిక్షణ పొంది, అనంతరం ఫ్యాకల్టీగా సేవలందిస్తున్న కోమటిపల్లి భవాని ఏర్పాటు చేసిన నూతన బ్యూటీ పార్లర్‌ను ప్రారంభించారు. సేవా సమితి ద్వారా ఏటా వందలాది మంది మహిళలకు బ్యూటీషియన్, టైలరింగ్, మగ్గం వర్క్ వంటి కోర్సుల్లో ఉచిత వృత్తి విద్యా శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ నైపుణ్యాలు నేర్చుకున్న వారు సొంతంగా వ్యాపారాలు ప్రారంభిస్తూ ఆర్థిక స్వావలంబన సాధించడం అభినందనీయమన్నారు. సింగరేణి సంస్థ చేపట్టే సంక్షేమ కార్యక్రమాల్లో మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిచ్చే శిక్షణలు అత్యంత కీలకమైనవని స్పష్టం చేశారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment