షిర్కే కాలనీలో ఘనంగా గణనాథుని శోభాయాత్ర

40 కిలోల లడ్డూను నెత్తిన మోసి ర్యాలీలో పాల్గొన్న మేయర్ ధర్ని మధుకర్

నస్పూర్, ఆర్.కె న్యూస్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 35వ డివిజన్ షిర్కే కాలనీలో శ్రీ లక్ష్మీ గణేష్ మండలి ఆధ్వర్యంలో గత 23 ఏళ్లుగా ప్రతిష్ఠిస్తున్న భారీ గణనాథుని శోభాయాత్ర భక్తిశ్రద్ధలు, కోలాహలం నడుమ ఘనంగా జరిగింది. ఈ శోభాయాత్రను మంచిర్యాల నగర మేయర్ ధర్ని మధుకర్, కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షుడు, కార్పొరేటర్ తూముల నరేష్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గణనాథునికి మేయర్ ప్రత్యేక పూజలు నిర్వహించి, కాలనీ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నిర్వహించిన ర్యాలీలో మేయర్ ధర్ని మధుకర్ గణపతికి నైవేద్యంగా సమర్పించిన భారీ 40 కిలోల లడ్డూను స్వయంగా తన నెత్తిన మోస్తూ భక్తులతో కలిసి అడుగులు వేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గత 23 సంవత్సరాలుగా సాంప్రదాయబద్ధంగా ఉత్సవాలు నిర్వహిస్తూ కాలనీలో భక్తి, ఐక్యతను చాటుతున్న మండలి నిర్వాహకులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. విఘ్నేశ్వరుని కృపతో నగర ప్రజలంతా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మర్రి శ్రీలత-రాజమొగిలి, అగ్గు సాగర్, శ్రీ లక్ష్మీ గణేష్ మండలి సభ్యులు, నాయకులు, మహిళలు, కాలనీవాసులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment