క్రీడలతో ఉద్యోగుల్లో ఉత్సాహం.. క్రమశిక్షణ, జట్టు స్ఫూర్తి పెంపొందుతాయి

కబడ్డీలో కాసిపేట-2 విజయం.. కేకే-5 రన్నర్స్

మందమర్రి, ఆర్.కె న్యూస్: సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 62వ వార్షిక క్రీడలు, సాంస్కృతిక పోటీలు మందమర్రి ఏరియాలో ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం స్థానిక సింగరేణి మైదానంలో నిర్వహించిన కబడ్డీ పోటీలను సీనియర్ పర్సనల్ ఆఫీసర్ (పి.ఓ.) శ్రీ కార్తీక్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్తీక్ మాట్లాడుతూ నిరంతరం విధి నిర్వహణలో నిమగ్నమయ్యే సింగరేణి ఉద్యోగులు, కార్మికుల శారీరక ఆరోగ్యం, మానసిక ఉల్లాసానికి సంస్థ క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. క్రీడలు ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని పెంచడంతో పాటు ఒత్తిడిని అధిగమించేందుకు దోహదపడతాయని తెలిపారు. కబడ్డీ కేవలం సంప్రదాయ క్రీడ మాత్రమే కాదని, క్రీడాకారుల్లో క్రమశిక్షణ, జట్టు స్ఫూర్తి, సమన్వయం, క్లిష్ట పరిస్థితుల్లో తక్షణ నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంపొందిస్తుందని పేర్కొన్నారు. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడా స్ఫూర్తిని చాటాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం ఉత్కంఠభరితంగా సాగిన కబడ్డీ పోటీలో కాసిపేట-2 జట్టు విజేతగా నిలవగా.. కేకే-5 జట్టు రన్నర్స్‌గా నిలిచింది. విజేతలను అధికారులు, ఉద్యోగులు, క్రీడాకారులు అభినందించారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ కో-ఆర్డినేటర్ శివకృష్ణ, జనరల్ కెప్టెన్ శ్రీను, సింగరేణి ఉద్యోగులు, క్రీడాకారులు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని క్రీడాకారులను ఉత్సాహపరిచారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment