ప్రకటించిన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
మంచిర్యాల , ఆర్.కె న్యూస్: తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా ప్రముఖ విద్యావంతుడు, సామాజిక కార్యకర్త డాక్టర్ ఉదారి చంద్రమోహన్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సోమవారం వివిధ జిల్లాల అధ్యక్షుల జాబితాను విడుదల చేస్తూ మంచిర్యాల జిల్లా బాధ్యతలను ఆయనకు అప్పగించారు. తనపై నమ్మకంతో ఈ కీలక బాధ్యతలను అప్పగించినందుకు పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవితకు చంద్రమోహన్ గౌడ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కవితక్క ప్రతిపాదించిన ‘పాంచజన్య’ సిద్ధాంతాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి కల్పన, సామాజిక న్యాయ సాధనే పరమావధిగా తెలంగాణ రక్షణ సేన పనిచేస్తుందని, జిల్లా వ్యాప్తంగా పార్టీ బలోపేతానికి నిరంతరం శ్రమిస్తానని స్పష్టం చేశారు.




ఆధ్వర్యంలో గత 23 ఏళ్లుగా ప్రతిష్ఠిస్తున్న భారీ గణనాథుని శోభాయాత్ర భక్తిశ్రద్ధలు, కోలాహలం నడుమ ఘనంగా జరిగింది. ఈ శోభాయాత్రను మంచిర్యాల నగర మేయర్ ధర్ని మధుకర్, కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షుడు, కార్పొరేటర్ తూముల నరేష్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గణనాథునికి మేయర్ ప్రత్యేక పూజలు నిర్వహించి, కాలనీ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నిర్వహించిన ర్యాలీలో మేయర్ ధర్ని మధుకర్ గణపతికి నైవేద్యంగా సమర్పించిన భారీ 40 కిలోల లడ్డూను స్వయంగా తన నెత్తిన మోస్తూ భక్తులతో కలిసి అడుగులు వేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గత 23 సంవత్సరాలుగా సాంప్రదాయబద్ధంగా ఉత్సవాలు నిర్వహిస్తూ కాలనీలో భక్తి, ఐక్యతను చాటుతున్న మండలి నిర్వాహకులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. విఘ్నేశ్వరుని కృపతో నగర ప్రజలంతా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మర్రి శ్రీలత-రాజమొగిలి, అగ్గు సాగర్, శ్రీ లక్ష్మీ గణేష్ మండలి సభ్యులు, నాయకులు, మహిళలు, కాలనీవాసులు పాల్గొన్నారు.
మహాగణపతిని టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో వైభవంగా ప్రతిష్ఠించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గడియారం శ్రీహరి మాట్లాడుతూ, వినాయక చవితి పర్వదినం వేళ ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులనే పూజించాలని పిలుపునిచ్చారు. మట్టి విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల నదులు, చెరువుల నీరు కలుషితం కాకుండా ప్రకృతి రక్షించబడుతుందన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (పీవోపీ), రసాయన రంగుల విగ్రహాల వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకృతి మిత్ర రాష్ట్ర అధ్యక్షుడు, పర్యావరణవేత్త గుండేటి యోగేశ్వర్ మాట్లాడుతూ, ప్లాస్టిక్ విపరీత వినియోగం వల్ల పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటోందని, పూజా కార్యక్రమాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించి స్టీల్ పాత్రలు, ఆకు దొన్నెలు వినియోగించాలని సూచించారు. ఈ పూజా కార్యక్రమాల్లో టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ కార్యదర్శి హబీబ్ హుస్సేన్, ఉపాధ్యక్షులు తిరుపతి, ఎన్. సత్యనారాయణ, సొసైటీ నాయకులు పుప్పాల హనుమంతరావు, పొన్న మల్లయ్య, శ్రీపతి బాపురావు, బొడ్డు శ్రావణ్ కుమార్, భూముల రామ్మోహన్, సైండ్ల మొండయ్య, నాగేశ్వరరావు, తిరుపతి రెడ్డి, సునీత, లక్ష్మీరాజయ్య, మల్లికార్జున్, కాలనీ మహిళలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.