పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం

  • 4వ డివిజన్ కార్పొరేటర్ గుమ్మడి శ్రీనివాస్
  • ఆర్.కె-6 అంగన్‌వాడీ కేంద్రంలో రాష్ట్రీయ పోషణ్ మాసం

నస్పూర్, ఆర్.కె న్యూస్: గర్భిణులు, బాలింతలు, చిన్నారులు సమతుల్య పోషకాహారం తీసుకోవడం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించవచ్చని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 4వ డివిజన్ కార్పొరేటర్ గుమ్మడి శ్రీనివాస్ పేర్కొన్నారు. సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 8 వరకు అంగన్‌వాడీ కేంద్రాల్లో నిర్వహిస్తున్న రాష్ట్రీయ మిషన్ శక్తి – పోషణ్ మాసం కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆర్కే-6 అంగన్‌వాడీ కేంద్రం-2లో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గుమ్మడి శ్రీనివాస్ మాట్లాడుతూ.. మహిళలు, గర్భిణులు, బాలింతలు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు ప్రభుత్వం అందించే పౌష్టికాహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలని సూచించారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రంలో 3 నుంచి 6 సంవత్సరాల లోపు చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. పిల్లల తొలి అభ్యసనానికి, మానసిక వికాసానికి అంగన్‌వాడీ కేంద్రాలే పునాది అని, తల్లిదండ్రులు తమ పిల్లలను తప్పకుండా అంగన్‌వాడీ కేంద్రాలకు పంపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ ఐసీడీఎస్ సూపర్‌వైజర్ రమాదేవి, 4వ వార్డు అధికారి మోటం నాగార్జున, మహిళా సాధికారత ప్రతినిధి విజయ, ఆర్థిక విద్యా నిపుణులు అప్పిక, లిప్స్, అంగన్‌వాడీ టీచర్లు సుమలత, శశికళ, కవిత, ఆయాలు, స్థానిక మహిళలు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment