వర్తక వాణిజ్య సంఘం ఆధ్వర్యంలో మేయర్‌కు ఘన సన్మానం
ప్రజలందరికీ గణనాథుని ఆశీస్సులు కలగాలని ఆకాంక్ష
నస్పూర్, ఆర్.కె న్యూస్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్ సీసీసీ కార్నర్ వద్ద వర్తక వాణిజ్య సంఘం శివ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వర్తక వాణిజ్య సంఘం ప్రతినిధులు మేయర్‌ను మర్యాదపూర్వకంగా శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మేయర్ ధర్ని మధుకర్ మాట్లాడుతూ.. ఆ విఘ్నేశ్వరుని కృపాకటాక్షాలు నగర ప్రజలందరిపై ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్‌తో పాటు వర్తక వాణిజ్య సంఘం సభ్యులు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.







