బహుజనుల రాజ్యాధికారమే లక్ష్యం: మహేష్ వర్మ

  • నస్పూర్ మండల కేంద్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ బైక్ ర్యాలీ
  • తీన్మార్ మల్లన్న నాయకత్వంలోనే బీసీల రాజ్యం సాధ్యం

నస్పూర్, ఆర్.కె న్యూస్: బహుజనుల రాజ్యాధికారమే లక్ష్యంగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న రాజ్యాధికార పాదయాత్రను ప్రారంభించారని తెలంగాణ రాజ్యాధికార పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మహేష్ వర్మ తెలిపారు. నస్పూర్ మండల కేంద్రంలో బూర రవీందర్ అధ్యక్షతన నిర్వహించిన బైక్ ర్యాలీకి ఆయన నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా మహేష్ వర్మ మాట్లాడుతూ, పార్టీ ఆవిర్భవించిన ఏడాది కాలంలో అనేక ప్రజా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించి ప్రజల్లో చైతన్యం తెచ్చామని పేర్కొన్నారు. ఎవరెంతో వారికంత వాటా అందించేందుకే ఈ యాత్రను జిల్లావ్యాప్తంగా కొనసాగిస్తున్నట్లు ఆయన వివరించారు. రానున్న రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాటాలు ఉధృతం చేస్తూ, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని చెప్పారు. వచ్చేది బీసీల రాజ్యమేనని, తీన్మార్ మల్లన్న నాయకత్వంలోనే రాజ్యాధికార సాధన సాధ్యమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేసేవారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు. అగ్రవర్ణాల రాజకీయ ఆధిపత్యాన్ని అంతం చేసేందుకు బహుజన వర్గాలు ఏకమై మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పాకాల దినకర్, పడాల శివతేజ, దాస్యపు దీపక్, మహమ్మద్ లతీఫ్, సీపతి సాయి కుమార్, మండల నాయకులు బొంగోని విద్యాసాగర్, గణవేణి నగేష్, మంతెన సాయిరామ్, తాళ్లపెల్లి రమేష్, షేక్ అక్తర్, జెలంపెల్లి రవి, తాళ్లపెల్లి సంపత్, జెలంపేల్లి తిరుమలేష్ పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment