వైభవంగా సామూహిక కుంకుమార్చన పూజలు

శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ గణేష్ మండలి ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో వినాయక నవరాత్రి ఉత్సవాలు
భక్తులకు అన్నదాన వితరణ, తీర్థప్రసాదాల పంపిణీ

నస్పూర్, ఆర్.కె న్యూస్: నస్పూర్ సింగరేణి రిటైర్డ్ కాలనీలోని శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ గణేష్ మండలి ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గణనాథుని మండప ప్రాంగణంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో సామూహిక కుంకుమార్చన పూజలు నిర్వహించారు. కాలనీ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సకల శుభాలతో వర్ధిల్లాలని కోరుతూ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అర్చకుల వేదమంత్రోచ్ఛారణల నడుమ వినాయకుడికి విశేష పూజలు చేసిన మహిళలు, కుంకుమార్చన గావించి స్వామివారికి నైవేద్యాలు సమర్పించి మహాహారతి ఇచ్చారు. అనంతరం నాంపల్లి తిరుపతి, గాండ్ల సుధీర్ భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించగా, మండలి ప్రతినిధులు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండలి నిర్వాహకులు మేడం తిరుపతి, ఎంబండి సమ్మయ్య, గడ్డం చంద్రయ్య, బెడద మహేందర్, కనవేని ఓదెలు, లశెట్టి గంగాధర్, రామంచ సంపత్, ఆంజనేయ ప్రసాద్, ముష్కే రవి, కాలనీ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment