సభ్యత్వంతో జనాభాను లెక్కిద్దాం.. రాజ్యాధికారం దిశగా సాగుదాం

తెలంగాణ మున్నూరు కాపు సంఘం (పటేల్స్) రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య

నస్పూర్‌లో సంఘం వెబ్‌సైట్ ఆవిష్కరణ

నస్పూర్, ఆర్.కె న్యూస్: తెలంగాణ మున్నూరు కాపు (పటేల్స్) కులస్తులంతా విధిగా సంఘం సభ్యత్వాన్ని స్వీకరించి, జనాభా ప్రాతిపదికన హక్కులు సాధించుకుంటూ రాజ్యాధికారం దిశగా ముందుకు సాగాలని తెలంగాణ మున్నూరు కాపు సంఘం (పటేల్స్) రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య పిలుపునిచ్చారు. నస్పూర్ ప్రెస్ క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతరం సంఘం అధికారిక వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కొండ దేవయ్య మాట్లాడుతూ… ఒకే కులం – ఒకే సంఘం నినాదంతో మున్నూరు కాపులంతా ఐక్యంగా ఉండాలని కోరారు. రాష్ట్రంలో తమ కుల జనాభాను వాస్తవ సంఖ్య కంటే తక్కువగా చూపించడం వల్ల రాజకీయంగా, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. పేర్ల చివర రావు అని ఉన్న మున్నూరు కాపులను ఇతర కులాల్లో కలపడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో న్యాయం జరుగుతుందని ఆశిస్తే, గత ప్రభుత్వంతో పాటు ప్రస్తుత ప్రభుత్వం కూడా నిర్లక్ష్య వైఖరినే అవలంబిస్తోందని విమర్శించారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నవారైనా సంఘం వెబ్‌సైట్ ద్వారా సభ్యత్వం నమోదు చేసుకోవాలని, అందరూ చొరవ చూపకపోతే జనాభా లెక్కల్లో మొదటి స్థానం నుంచి ఐదో స్థానానికి పడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అలాగే ప్రభుత్వం ప్రకటించిన మున్నూరు కాపు కార్పొరేషన్‌కు తక్షణమే రూ. 1,000 కోట్ల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బోరిగాం రాజారాం, నాయకులు పానుగంటి శ్రీనివాస్, నాయకులు శ్రీపతి శ్రీనివాస్, శ్రీపతి సురేష్ కుమార్, నరెడ్ల శ్రీనివాస్, కాశ రాజు, ఆకుల మహేందర్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment