మంచిర్యాల, ఆర్.కె న్యూస్: ఉపాధి కల్పన శాఖలో సుదీర్ఘకాలం సేవలందించి పదవీ విరమణ పొందిన టీఎన్జీవో మంచిర్యాల జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు యతిపతి రమేష్ బాబు దంపతులను సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ అధ్యక్షుడు సంద అశోక్ ముఖ్య అతిథిగా హాజరై రమేష్ బాబు దంపతులకు పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రమేష్ బాబు ఎంప్లాయిమెంట్ శాఖకే కాకుండా టీఎన్జీవో సంఘానికి కూడా వన్నె తెచ్చేలా సేవలందించారని కొనియాడారు. ఆయన శేష జీవితం ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో గడవాలని ఆకాంక్షించారు. ఈ సన్మాన కార్యక్రమంలో టీఎన్జీవో మంచిర్యాల జిల్లా హౌసింగ్ సొసైటీ కార్యదర్శి హబీబ్ హుస్సేన్, జిల్లా మాజీ కార్యదర్శి పుప్పాల హనుమంతరావు, జిల్లా కార్యదర్శి బొడ్డు శ్రావణ్ కుమార్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీపతి బాపురావు, కోశాధికారి సతీష్ కుమార్, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, బెల్లంపల్లి యూనిట్ అధ్యక్షుడు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
8







