ఎస్సార్పీ-3 గనిపై కార్మికుడికి ప్రమాదం

పరామర్శించిన టీబీజీకేఎస్ నాయకులు
మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని అమోర్ ఆసుపత్రికి రెఫర్

నస్పూర్, ఆర్.కె న్యూస్: శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్సార్పీ-3 గనిలో శనివారం మొదటి బదిలీ లో విధులు నిర్వహిస్తుండగా దుర్గం శంకర్ అనే సపోర్ట్‌మ్యాన్ ప్రమాదవశాత్తు గాయపడ్డారు. ప్రమాదంలో ఆయన కుడిచేతి బొటనవేలికి తీవ్ర గాయమై రక్తస్రావం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు వెంటనే స్పందించి ఆసుపత్రికి చేరుకొని కార్మికుడిని పరామర్శించారు. అనంతరం ఏరియా వైద్యులతో మాట్లాడి, మెరుగైన వైద్య చికిత్స కోసం దుర్గం శంకర్‌ను హైదరాబాద్‌లోని అమోర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి రెఫర్ చేయించారు. కార్మికుడికి మెరుగైన వైద్యం అందించేలా చొరవ తీసుకుంటామని నాయకులు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, సెంట్రల్ జాయింట్ సెక్రెటరీ పొగాకు రమేష్, సెంట్రల్ నాయకులు నీలం సదయ్య, శ్రీరాంపూర్ ఏరియా కార్యదర్శులు గడ్డం మహిపాల్ రెడ్డి, రామిడి మహేందర్ రెడ్డి, ఎస్సార్పీ-3 గని పిట్ సెక్రటరీ తీగల వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment