కేంద్రీయ విద్యాలయంలో ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు

పూల సోయగాలు, జానపద నృత్యాలతో కళకళలాడిన పాఠశాల ప్రాంగణం
సంప్రదాయాల పరిరక్షణతోనే ఐక్యతా స్ఫూర్తి: ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపాల్ లోకేష్ కుమార్ యాదవ్

మంచిర్యాల, ఆర్.కె న్యూస్: మంచిర్యాల పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ ముందస్తు వేడుకలను మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాలయ ప్రాంగణమంతా రంగురంగుల పూల శోభతో, తెలంగాణ జానపద గీతాల సందడితో పండుగ వాతావరణం సంతరించుకుంది. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా పేర్చారు. విద్యార్థినులు సంప్రదాయ వస్త్రధారణతో బతుకమ్మల చుట్టూ చప్పట్లు కొడుతూ, లయబద్ధంగా ఆడుతూ పాడుతూ పండుగ విశిష్టతను చాటారు. ఈ సందర్భంగా ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపాల్ లోకేష్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ… ప్రకృతిని ఆరాధించే బతుకమ్మ పండుగ మానవ జీవనానికి, పర్యావరణానికి ఉన్న విడదీయరాని బంధాన్ని తెలియజేస్తుందన్నారు. ఇలాంటి సాంస్కృతిక వేడుకల నిర్వహణ ద్వారా విద్యార్థుల్లో మన ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాల పట్ల అవగాహన, గౌరవం పెరగడంతో పాటు ఐక్యత, సోదరభావం పెంపొందుతాయని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment